నయనతార - తనకంటూ స్పెషల్ ఇమేజ్, క్రేజ్ సంపాదించుకున్న నయన్‌.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సోలోగా ప్రూవ్ చేసుకుంటోంది. 

సమంత- పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసి ఇప్పుడు విడాకులు తీసుకున్నాక ఒక్కసారిగా చెలరేగిపోతోంది. 

కాజల్ అగర్వాల్ - పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్‌ తీసుకున్న ఈ భామ.. మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది.

నజ్రియా - సౌత్‌లో తనకున్న క్రేజ్‌తో పెళ్లి అయినా హీరోయిన్‌గా కంటిన్యూ అవుతోంది ఈ మళయాళ కుట్టి. 

ఆలియా భట్- కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్ కూడా ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా సూపర్ స్పీడ్‌గా సినిమాలు చేస్తోంది. 

దీపికా పదుకొనే-  పెళ్లి తరువాత కూడా ఈమె క్రేజు ఏమాత్రం తగ్గలేదండోయ్‌. అదే స్పీడ్ లో సినిమాలు చేస్తోంది ఈ అందాల భామ.

కత్రినా కైఫ్ - పెళ్లయ్యాక భర్త, పిల్లలు, సంసారం అనుకోకుండా కెరీర్ మీద ఫోకస్ చేసింది కత్రినా.

కరీనా కపూర్ - పెళ్లయిన తర్వాత సినిమాలు చేయొచ్చనే ట్రెండ్ సృష్టించిందే కరీనా.

ఐశ్వర్యరాయ్‌ - బాలీవుడ్ లెజెండ్ బచ్చన్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్లినా తనకెరీర్‌ను మాత్రం అపలేదు ఈ సుందరి. 

ప్రియాంక చోప్రా - బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లిపోయిన ఈ భామ కూడా ఇంకా హాట్ హీరోయిన్‌గానే కంటిన్యూ అవుతోంది.

అనుష్క శర్మ - కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోహ్లీలాగే ఈమె కూడా దూసుకెళ్తోంది.  

విద్యాబాలన్ - పెళ్లయిన తర్వాత కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. 

యామి గౌతమ్ - గ్లామర్‌ రోల్స్‌ చేస్తూ మ్యారీడ్‌ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

మౌని రాయ్  - ఈ అందాల భామ కూడా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.