ఈ బాలీవుడ్ నటి పేరు నికితా ఘాగ్ . ఈమె ప్రొడ్యూసర్ కూడా. సొంతంగా నిఖితా ఘాగ్ ప్రొడక్షన్ సంస్థను కూడా రన్ చేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మందికి పైగా ఫాలోవర్స్‌ని కలిగివుంది. అంతా బాగానే ఉన్నా… తాజాగా ఆల్‌మోస్ట్ నగ్నంగా కనిపించి విమర్శలు ఎదుర్కొంటోంది.
బేకాబూ 3, ఫహ్ సే ఫాంటసీ, నషీలా హస్న్ వంటి సిరీస్‌లతో కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్న నిక్కిత.. ఇప్పుడు ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
నగ్న ఫొటోషూట్ చేసిన నికితా, ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వాటిపై దుమారం రేగడంతో.. వెంటనే వాటిని బ్లర్ చేసింది. కానీ అప్పటికే అవి సోషల్ మీడియాలోకి వెళ్లి షేర్ కూడా అయిపోయాయి.
అసలు నికితా ఇలా ఎందుకు చేసిందనేది ఫ్యాన్స్‌కి అర్థం కాలేదు. ఈ ఫొటోలకు ఆమె.. “ఐస్ ఆన్ మీ” అని క్యాప్షన్ పెట్టింది. మరో ఫొటోకి ఫైర్ ఇమోజీని క్యాప్షన్‌గా పెట్టింది.
అంటే ఆమె ఉద్దేశం ఏంటి.. తనను నగ్నంగా చూడమని ఆమె కోరుకుంటోందా? అనే ప్రశ్న నెటిజన్ల నుంచి వస్తోంది. అసలు ఇదేం ఫ్యాషన్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఫ్యాషన్ ఏముందని అడుగుతున్నారు?
దయచేసి నాకు పూర్తిగా చూపించండి, ఇంకా కొంత ఎందుకు మిగిల్చారు?” అని ఓ యూజర్ ట్రోల్ చెయ్యగా.. “నేను ఇదంతా ఎందుకు చూడాలి. గుడ్డివాడినైనా బాగుండు” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.