గోమఠేశ్వర విగ్రహం: కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఏక శిలా విగ్రహాల్లో ఈ బహుబలి విగ్రహం ఒకటి
హర్మందిర్ సాహిబ్: 16వ శతాబ్దంలో నిర్మితమైన ఈ గురుద్వారా పై అంతస్థులకు 400 కేజీల బంగారు పూత వేయడంతో గోల్డెన్ టెంపుల్‌గా పేరొందింది
తాజ్ మహల్: ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన ఈ తాజ్ మహల్‌ను చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌పై ఉన్న ప్రేమకు గుర్తుగా 17వ శతాబ్దంలో నిర్మించారు
హంపి: కర్ణాటకలోని విజయనగరంలో ఉంది. 1342 నుంచి 1565 వరకు విజయనగర రాజుల పాలనలో ఎంతో ఔన్నత్య స్థితిలో ఉండేది
కోణార్క్ సూర్యదేవాలయం: ఒడిశాలోని కోణార్క్‌లో ఉండే ఈ ఆలయ నిర్మాణం కళింగ నిర్మాణశైలిలో ఉంటుంది. 13వ శతాబ్దంలో మధ్యభాగంలో నిర్మితమైంది
నలంద: బీహార్‌లోని పాట్నాలో ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం. క్రీ.శ. 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది
ఖజురహో: మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉంది. గొప్ప దేవాలయాలు ఉండటంతో, ఈ గ్రామం పేరు ప్రపంచపటంలోకి ఎక్కింది
మీనాక్షి టెంపుల్: తమిళనాడులోని మదురైలో ఉంది. పురాణాల ప్రకారం.. మాత నివాసమైన మదురైని శివుడు ఆమెను వివాహం చేసుకునేందుకు సందర్శించాడు
జైసల్మేర్ కోట: సూర్యాస్తమయంలో బంగారంలా మెరిసిపోవడంతో దీన్ని ‘బంగారు కోట’ అంటారు. 1156లో భాటి రాజపుత్ర రాజు జైసల్ దీన్ని నిర్మించాడు