మన మెదడు బరువు 1.5 కిలో. మన శరీరంలోని బరువులో 2% మన మెదడు బరువు ఉంటుంది.

 ఒక్క మెదడు 20% ఆక్సిజన్, రక్తాన్ని ఉపయోగిస్తుంది. మన మెదడు లో 60% కొవ్వే ఉంటుంది.

మన మెదడు ఆక్సిజన్ లేకుండా కేవలం 5 నుంచి 6 నిముషాలు మాత్రమే జీవిస్తుంది, ఆ తరవాత చనిపోతుంది.

మన మెదడులో 100 బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి.

మన మెదడులో ఉండే రక్త నాళాల యొక్క పొడువు 1,60,934 కిలోమీటర్లు.

మనలో చాలా మంది సమయం వృధా చేయొద్దు అని ఒకే  సమయంలో రెండు పనులు చేస్తారు.

ఇలా చేయడం వాళ్ళ మన మెదడు 50% తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఒకసారి ఒకే పని చేయాలి.

మన మెదడు 2.5 పెటా బైట్ల సమాచారాన్ని నిల్వ ఉంచగలదు. 2.5 పెటబైట్లు అంటే సమారు 2,500,000 Gb అని అర్థం.

తక్కువగా నిద్ర పోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మన జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకొనే శక్తి తగ్గిపోతుంది.

మానవులు అందరు కలలుకంటారు. కళ్లు లేని వాళ్ళు కూడా కలలు కంటారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన మెదడు పగటి కన్నా మనము కలలు కనేటప్పుడు బ్రెయిన్ వేవ్స్ ఎక్కువ ఆక్టివ్ గా ఉంటాయి.