పునుగు పిల్లి విసర్జనతో కాఫీ పౌడర్ తయారు చేసి కిలో రూ.50 వేల వరకు అమ్ముతున్నారు.

దీన్నే 'సివెట్ కాఫీ' లేదా 'కోపీ లువాక్' అని పిలుస్తారు. ఆసియాలో కాఫీ ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశానిది మూడో స్థానం.

ఈ ఖరీదైన కాఫీ తయారయ్యేది మన పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోని కొడగు(కూర్గ్) జిల్లాలో ఈ కాఫీని తయారు చేస్తారు.

అసలు ఈ కాఫీ పొడి తయారయ్యే విధానమే విచిత్రంగా ఉంటుంది. పునుగు పిల్లి విసర్జనతోనే ఈ కాఫీ పొడి తయారవుతుంది.

కాఫీ గింజల్ని పునుగు పిల్లి తిని మలాన్ని విసర్జిస్తుంది. పునుగు పిల్లి విసర్జనను సేకరించి కాఫీ పొడి తయారు చేసి అమ్ముతారు.

ఈ కాఫీ పొడిలో పోషకాలు ఎక్కువ ఉంటాయన్న వాదన ఉంది. అందుకే అంత ఖరీదు ఉంటుందని చెబుతారు.

సంపన్నవర్గాల్లో ఈ కాఫీ పొడికి డిమాండ్ ఎక్కువ. గల్ఫ్, యూరప్‌ దేశాలకు ఇండియా నుంచి ఎగుమతి అవుతుంది.

ఈ కాఫీ పొడికి ఇంత డిమాండ్ ఉండటంతో కూర్గ్‌లో లగ్జరీ కాఫీ తయారీ చిన్నతరహా పరిశ్రమగా మారిపోయింది.

గతంలో ఏడాదికి 20 కిలోల కాఫీ మాత్రమే తయారుచేసేవాళ్లు. డిమాండ్ పెరుగుతున్నకొద్ది ఉత్పత్తి కూడా పెరిగింది.

పునుగు పిల్లుల్ని పెంచుతూ, వాటికి కాఫీ గింజలు తినిపిస్తూ మలాన్ని సేకరించి కాఫీ పొడి తయారు చేస్తున్నారు.

ఇప్పుడు ఏడాదికి సుమారు 500 కిలోల వరకు సివెట్ కాఫీ తయారవుతుందని,  కేజీ ధర క్వాలిటీని బట్టి రూ.10,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.

స్థానికంగా కిలో ధర రూ.8,000. కూర్గ్‌లోని ‘Ainmane’ ఔట్‌లెట్‌లో ఈ కాఫీ దొరుకుతుంది.