బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ ఆ నాలుగు జిల్లాలే టార్గెట్

ఏపీలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమిళనాడు వద్ద వాయుగుండం తీరం దాటడంతో ఏపీ సరిహద్దు జిల్లాలలో కుంభవృష్టి వానలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తడంతో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ప్రజా జీవనం స్తంభించింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన… ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈసారి కూడా నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపైనే ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also: జూపార్కులో యువకుడి హల్‌చల్… సింహం బోనులోకి వెళ్లేందుకు యత్నం

నైరుతి బంగాళాఖాతంలోని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోందని… ఈ కారణంగా ఈనెల 27 నుంచి ఆయా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన నివేదికలో వెల్లడించింది. అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో వరద బాధిత జిల్లాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే పెన్నా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరాయి.

Related Articles

Latest Articles