చమురు ధరలపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం: ఖర్గే

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢీల్లీల్లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. ఈ మేరకు ద్రవ్యోల్బణం, చమురు ధరల పెంపు, చైనా వివాదం, కాశ్మీర్‌ అంశంపై పార్లమెంట్‌లో కేంద్రాన్నిప్రశ్నించనున్నట్టు తెలిపారు. కాగా కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని పట్టు పట్టనుంది.

కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేయనున్నట్టు కాంగ్రెస్ నేత మల్లిఖార్జన ఖర్గే తెలిపారు. ఇప్పటికే దేశంలో పెరిగిన నిరుద్యోగం కరోనా నివారణ చర్యలపైన కేంద్రాన్ని నిలదీయనున్నట్టు తెలిపారు. రైతుల పోరాటంలో అమరులైన వారికి నష్టపరిహారం గురించి కూడా పార్లమెంట్‌లో చర్చించనున్నారు. మరోవైపు రైతుల డిమాండ్లను సైతం పరిష్కరించాలని డిమాండ్లతో కేంద్రంతో పోరాడతామని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు.

Related Articles

Latest Articles