ఢీల్లీ కాలుష్యంపై ఆదేశాలు ఇస్తునే ఉంటాం: సుప్రీం కోర్టు

ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పొల్యూషన్‌ తగ్గినా.. కేసు మూసివేసేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు ఏమీ చేయకపోడంతోనే కోర్టులు జోక్యం చేసుకో వాల్సిన అవసరం వస్తుందనే అంచనాలు ప్రజల్లో ఉన్నాయని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కోర్టు తీసుకున్న కొన్ని చర్యల వల్ల 40 శాతం కాలుష్యం తగ్గిందని కొన్ని వార్తాపత్రికలు పేర్కొన్నాయని చెబుతున్నారని, అవి సరైవనో కాదోతెలియదని సొలిసీటర్‌ జనరల్‌తో పేర్కొన్నారు. ఈ సమ యంలో నిర్మాణాలకు అనుమతించాలని, లేకుండా పస్తులు ఉండా ల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తమ వద్దకు కార్మికులు ఓ పిటిషన్‌తో వచ్చారని పేర్కొంది.

‘ఇది దేశ రాజధాని, ప్రపంచానికి మనం ఏం సంకేతం పంపుతు న్నామో ఓసారి చూడండి’ అంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం తగ్గినప్పటికీ, ఈ విషయంపై విచారణ కొనసాగిస్తామని తెలిపింది. తాము ఆదేశాలు ఇస్తూనే ఉంటామని, ప్రతి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి విచారిస్తామని చెప్పింది. వాయు నాణ్యత సూచి 381 ఉందని, మీరు 230 అని చెబుతున్నదీ వాస్తవం కాకపోవచ్చునని తెలిపింది. ఈ 2-3 రోజుల్లో మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ .. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Related Articles

Latest Articles