చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసింది: విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పును కళ్లారా చూశామని, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని ఆయన మర్యాద పూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శి మినహాయించి అన్ని చోట్లా గెలిచామన్నారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలకు సంకేతాలుగా భావించాలన్నారు. గత ఎన్నికల్లో కొడుకు మంగళగిరిలో ఓడిపోతే.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలయ్యారన్నారు.

ఈ ఫలితాలను చంద్రబాబు అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు కు గ్రహణం పట్టింది…ఇది రాష్ట్రానికి కార్తీక పౌర్ణమి రోజని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంత ప్రజలు కూడా 98 శాతం వైసీపీకి మద్దతు ఇచ్చార న్నారు.చంద్రబాబు ఇంత వరకు మా నాయకుడి పై చేసిన దుష్ప్ర చారాన్ని ఇక హైదరాబాద్ నుండి కొనసాగించాలనే నేను కోరుకుం టున్నాని ఆయన అన్నారు.ఇలాంటి దుష్ప్రచారం వల్లే చంద్ర బాబును ప్రజలు ఛీత్కరిస్తున్నారని ఇప్పటికైనా ఆయన ఆలోచించుకోవాలన్నారు.

లోకేష్‌ నన్నేం పీక్కంటారు..48 గంటల్లో స్టే తీసుకు వస్తాను అంటున్నాడు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని లోకేష్ ను శిక్షించాలని న్యాయస్థానాలను కోరుతున్నానని విజయ సాయిరెడ్డి అన్నారు. న్యాయస్థానాలను ఎవరూ కించపరచకూడదు.తన కొడుకు ఎందుకూ పనికి రాకుండా పోయాడని చంద్రబాబు మనస్థాపం చెందు తున్నాడన్నారు.ఇప్పుడు తండ్రి, కొడుకులు ఇద్దరికీ ఇప్పుడు స్థానా లు లేవని, కొత్త నియోజకవర్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విజయసాయిరెడ్డి అన్నారు.

Related Articles

Latest Articles