వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీని వదలని కరోనా

వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో ఐదుగురు మెడికోలు కరోనా బారినపడ్డారు. నిన్న 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇవాళ మరోసారి పరీక్షలు నిర్వహించగా మరో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. దీంతో కేఎంసీలో మొత్తం 22 మంది మెడికల్ విద్యార్థులు కరోనాకు గురయ్యారు. కరోనా అలజడితో అటు విద్యార్ధులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన నిట్‌ అధికారులు.

ఇదిలా వుంటే నిట్ లోనూ కరోనా వీరవిహారం చేస్తోంది. ఇటీవల క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చారు. 200 మంది విద్యార్థులు కాలేజీకి తిరిగివచ్చాక అధికారులు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 17 మందికి కరోనా పాజిటివ్ తేలడంతో వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. నిట్‌లో కరోనా కేసులు వెలుగుచూడడంతో తరగతులను నిలిపివేశారు. ప్రైమరీ కాంటాక్టు అయిన వారందరూ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కరోనా కేసులు వెలుగు చూడడంతో మిగతా విద్యార్థులు, ఉద్యోగులందరికీ కూడా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Related Articles

Latest Articles