అదే రహానే సమస్య అంటున్న వీవీఎస్…

భారత స్టార్ టెస్ట్ ఆటగాడు అజింక్య రహానే ఈ మధ్య అంతగా రాణించలేక పోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్న రహానే పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో అతని పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా రహానే ఫామ్ గురించి వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఫుట్‌వర్క్ అతనికి సమస్యలను కలిగిస్తోందని చెప్పాడు. అతను షాట్ ను ఫ్రెంట్ ఫుట్ పై ఆడాలా.. లేదా బ్యాక్ ఫుట్ పై ఆడాలా అనేది నిర్ణయించుకోవడం లేదు. ఈరోజు రహానే ఔట్ అయిన తీరును ఒక్కసారి చూడండి. మీకు అర్ధం అవుతుంది అని లక్ష్మణ్ అన్నాడు. ఇక రహానే క్రీజులోకి వెళ్లిన తర్వాత మొదట్లో అంత నమ్మకంగా బ్యాటింగ్ చేయడం లేదు అని అన్నారు. ఇక రహానే స్ట్రైక్ రొటేషన్ కూడా పేలవంగా ఉంది అని చెప్పాడు లక్ష్మణ్.

Related Articles

Latest Articles