హిందీ ‘ఛత్రపతి’ సెట్ లో వి. వి. వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతోంది. శనివారం ద‌ర్శ‌కుడు వి. వి. వినాయ‌క్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా బీఎస్ఎస్‌9 సెట్లో వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ నిర్మాత‌, వైజాగ్ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజ‌రై వి. వి. వినాయ‌క్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. హిందీ ‘ఛత్రపతి’లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు సాహిల్ వైద్‌, అమిత్ నాయ‌ర్‌, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్‌, స్వ‌ప్నిల్‌, అశిష్ సింగ్‌, మ‌హ్మ‌ద్ మోనాజిర్‌, అరుషిక దే, వేదిక‌, జాస‌న్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తనిష్క్ బగ్చి సంగీతం అందిస్తున్నారు.

-Advertisement-హిందీ 'ఛత్రపతి' సెట్ లో వి. వి. వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

Related Articles

Latest Articles