బిగ్ బాస్ 5 : ఈ కంటెస్టెంట్ కు దారుణమైన ఓటింగ్

‘బిగ్ బాస్ 5’ 11వ వారం వీకెండ్ కు వచ్చేసింది. ఇటీవల కాస్త స్పీడ్ ను పుంజుకున్న ఈ షో ఆసక్తికరంగా మారింది. టాస్కులు, సన్నీ అగ్రెషన్, మానస్ సైలెన్స్, సిరి, షన్ను ఫ్రెండ్ షిప్ కాస్తా లవ్ షిప్ గా మారడం వంటి విషయాలు, వివాదాలతో వారాంతానికి చేరుకుంది. హౌస్ లో ఈ వారం రోజుల్లో జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఈరోజు వచ్చే ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి ఎలా మొట్టికాయలు వేయబోతున్నారో చూడాలని బుల్లితెర వీక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే వీకెండ్ ఎలిమినేషన్. ఈ వీక్ హౌస్ కెప్టెన్ అయిన రవి తప్ప అందరూ నామినేషన్ లో ఉన్నారు. అందులో అనీ, సిరి, కాజల్ డేంజర్ జోన్లో ఉన్నట్టు సమాచారం.

Read Also : “ఎవరు మీలో కోటేశ్వరులు” పూనకాల ఎపిసోడ్ లోడింగ్… ఎప్పుడంటే ?

ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో స్నేహితులుగా కంటిన్యూ అవుతున్న వాళ్లలో ఓ కంటెస్టెంట్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంటే, మరో కంటెస్టెంట్ కు దారుణంగా ఓటింగ్ పడిపోతున్నట్టు తెలుస్తోంది. ఒక చిన్న పొరపాటు ‘బిగ్ బాస్ 5’లో విషయాలను పెద్దగా మార్చగలదు. గత రెండు వారాల్లో మానస్ విషయంలో కూడా అదే జరిగింది. హౌస్‌లో గ్రూపులు సృష్టించి సన్నీని రెచ్చగొడుతున్న తీరు సోషల్ మీడియాలో అభిమానులకు మింగుడు పడలేదు. మానస్ ఒకప్పుడు షోలో విన్నర్ రేసులో ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని ఓట్ల లెక్కింపు బాగా తగ్గింది. నామినేషన్ లో కూడా వెనుకంజలో ఉన్నాడు. మరోవైపు హౌస్‌లో పవర్‌ఫుల్ దూకుడు ప్రదర్శిస్తూ హీరోగా విపరీతమైన అభిమానులను ఏర్పరుచుకుంటున్నాడు సన్నీ.

Related Articles

Latest Articles