పంజాబ్‌కు కొత్త డీజీపీగా వీకే భ‌వ్రా

పంజాబ్‌ రాష్ట్రానికి కొత్త డీజీపీగా వీరేశ్‌ కుమార్‌ భవ్రా నియమితులయ్యారు. ప్రధాని మోడీ ఇటీవల పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ పర్యటనకు వచ్చారు. అయితే ఈ మోడీ రోడ్డు మార్గంలో వస్తున్నారని తెలుసుకున్న రైతులు ప్రధాని మోడీ కాన్వాయ్‌కు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. సుమారు 20 నిమిషాల పాటు మోడీ కాన్వాయ్‌ రోడ్డుపైనే నిలిచిపోయింది. చివరికి చేసేదేంలేక మోడీ తిరిగుప్రయాణమయ్యారు.

ఈ నేపథ్యంలో భద్రత లోపాలు తలెత్తడంతో పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ డీజీపీని మార్చివేశారు. దినకర్‌ గుప్తా, వీరేశ్‌ కుమార్‌ భవ్రా, ప్రబోధ్‌ కుమార్‌ పేర్లను చన్నీ ప్రభుత్వం యూపీఎస్సీకి పంపించింది. దీంతో చన్నీ ప్రభుత్వం పంపిన వారిలో వీరేశ్‌ కుమార్‌ భవ్రాకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అయితే పంజాబ్‌ డీజీపీగా వీరేశ్‌ కుమార్‌ భవ్రా రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.

Related Articles

Latest Articles