గుడ్ న్యూస్ : ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌కి ఎంట్రీ.. !

ఐపీఎల్‌ అభిమానులకు తీపికబురు అందింది. ఐపీఎల్‌ 2021 మ్యాచ్‌ లకు అభిమానులను అనుమతిస్తున్నట్లుగా కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదల అయింది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 2021 కు మధ్య లో బ్రేక్‌ పడిన సంగతి తెల్సిందే. అయతే.. ఈ సీజన్‌ లో మిగిలిన మ్యాచ్‌ లు ఈ నెల 19 నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో… ఐపీఎల్‌ మ్యాచ్‌ లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే… సెప్టెంబర్‌ 16 వ తేదీ నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌ ల టికెట్లు ను ఆన్‌లైన్‌ లో అందుబాటులో ఉంచనున్నారు. అధికారిక వెబ్‌ సైట్‌ www.iplt20.com లో ఐపీఎల్‌ టికెట్లు లభ్యమవుతాయని ప్రకటించింది యాజమాన్యం. కాగా.. సెప్టెంబర్‌ 19 వ తేదీన ముంబై మరియు చెన్నైల మధ్య మొదటి మ్యాచ్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-