వివేకా హత్య కేసు: కీలక అనుమానితుడికి నార్కో పరీక్షలు రద్దు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను నార్కో పరీక్షలకు అనుమతి కోసం జమ్మలమడుగు కోర్టులో ప్రవేశపెట్టారు. నార్కో పరీక్షలు జరపాలంటే న్యాయస్థానం అనుమతించడంతో పాటు, నార్కో పరీక్షలు చేయించుకునే వ్యక్తి అంగీకారం కూడా అవసరం. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి స్పందిస్తూ, నార్కో పరీక్షలకు సమ్మతమేనా? అని సునీల్ యాదవ్ ను అడిగారు. నార్కో పరీక్షలకు తాను అంగీకరించబోనని సునీల్ యాదవ్ స్పష్టం చేశాడు. దాంతో సీబీఐ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ నిబంధన కారణంగానే సీబీఐకి నిరాశ ఎదురైంది.

వివేకా హత్యకేసులో వాస్తవాలు రాబట్టేందుకు సునీల్ యాదవ్ ను గోవాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు కోర్టు అనుమతితో 10 రోజుల క్రితం కస్టడీలోకి తీసుకొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్ట్ తర్వాత కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-