డైరెక్టర్ శంకర్ కూతురు మూవీ ఎంట్రీ… కార్తికి జోడిగా…!

కోలీవుడ్ హీరో కార్తీ తన తదుపరి చిత్రం కోసం “కొంబన్” దర్శకుడు ముత్తయ్యతో కలిసి పని చేయబోతున్నారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సూర్య నెక్స్ట్ మూవీకి “విరుమన్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. కార్తీతో పాటు ఈ చిత్రంలో రాజ్ కిరణ్ కూడా కనిపించబోతున్నారు. ఆయన కార్తీతో కలిసి “కొంబన్‌”లో స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, సూరి, అదితి శంకర్ ఇతరులు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు. అయితే విజనరీ డైరెక్టర్ శంకర్ కుమార్తె ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ విషయాన్ని కూడా స్పెషల్ గా తెలుపుతూ ఆమె పోస్టర్ ను రివీల్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో “విరుమన్” ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతోంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 18న ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు.

Read Also : టాక్ వచ్చిన.. వసూళ్లు ఆశించినంతగా లేవు!

కాగా గతంలో కార్తీ, దర్శకుడు ముత్తయ్య కాంబోలో “కొంబన్” మూవీ తెరకెక్కింది. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ డ్రామాలో కార్తీ గ్రామీణ యువకుడిగా కన్పించాడు. లక్ష్మీ మీనన్, రాజ్‌కిరణ్ కీలక పాత్రల్లో కన్పించగా… ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. మరోసారి కార్తీ, ముత్తయ్య కాంబినేషన్ రిపీట్ అవుతుండడం అంచనాలను పెంచేస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-