విశ్వ‌క్ సేన్ చేస్తోంది ఆ క‌థేనా!

ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌, ర‌చ‌యిత బెజ‌వాడ ప్ర‌స‌న్న కుమార్ ల‌ది సక్సెస్ ఫుల్ కాంబినేష‌న్. అయితే… ఒక్కోసారి ఎంత స‌క్సెస్ ట్రాక్ లో ఉన్న వారికైనా సినిమాను సెట్ చేయ‌డానికి ఊహకంద‌ని అడ్డంకులు ఎదుర‌వుతుంటాయి. ప్ర‌స‌న్న‌కుమార్ చెప్పిన ఓ క‌థ న‌చ్చి, దానిని ర‌వితేజ హీరోగా త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించ‌డానికి ముందుకొచ్చింది. ఇక అధికారిక ప్ర‌క‌ట‌నే ఆల‌స్యం అనుకున్నారు. కానీ ప్ర‌స్తుతం ఖిలాడీ చిత్రంలో న‌టిస్తున్న ర‌వితేజ‌… ఆ త‌ర్వాత శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.
దాంతో బ‌హుశా అదే క‌థ‌ను అనుకుంటా… వ‌రుణ్ తేజ్ కు త్రినాథ‌రావు న‌క్కిన‌, ప్ర‌సన్న కుమార్ వినిపించార‌ట‌. అయితే… వ‌రుణ్ తేజ్ స్పంద‌న ఏమిట‌నేది తెలియ‌దు కానీ…. ప్ర‌స్తుతం పాగ‌ల్ మూవీ చేస్తున్న విశ్వ‌క్ సేన్ కు కూడా వీరు ఓ క‌థ చెప్పార‌ట‌. దానిని విన్న వెంట‌నే విశ్వ‌క్ ఓకే చెప్పేశాడ‌ట‌. నిజానికి విశ్వ‌క్ సేన్ తో పాగ‌ల్ మూవీ నిర్మిస్తున్న‌ బెక్కెం వేణుకు త్రినాథ‌రావు న‌క్కిన‌కు మంచి అనుబంధం ఉంది. ఈ ద‌ర్శ‌క నిర్మాత‌లు గ‌తంలో కలిసి సినిమాలు చేశారు. అదే అనుబంధంతో త్రినాథ‌రావు ప్రాజెక్ట్ కు విశ్వ‌క్ ప‌చ్చ‌జెండా ఊపాడ‌ని తెలుస్తోంది. ఈ మూవీని సితార ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ లో చేయ‌బోతున్నార‌ట‌. దీనికి చెట్టుకింద ప్లీడ‌ర్ అనే టైటిల్ కూడా అనుకున్నార‌ట‌. అయితే… గ‌తంతో ర‌వితేజ‌కు ప్ర‌స‌న్న‌కుమార్ చెప్పిన క‌థ ఇదే అని, సో… ఇక ర‌వితేజ‌, త్రినాథ రావు న‌క్కిన కాంబోలో మూవీ ఉండ‌న‌ట్టే అని ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-