మాస్ మహారాజాతో కోలీవుడ్ హీరో.. డబుల్ ‘ధమాకా’ కన్ఫర్మేనా.?

మాస్ మహారాజ రవితేజ, త్రినాధరావు నక్కిన కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ధమాకా. పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది. ఇక ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కి కూడా చోటు ఉన్నదని, ఆ హీరో గా రాజ్ తరుణ్ ని ఎంపిక చేసినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. అందుకే ఈ పాత్ర కోసం ఒక యంగ్ హీరోనే తీసుకోవాలని చూస్తున్నారట. అయితే తాజాగా ఆ పాత్రకోసం కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా విష్ణు విశాల్ సోషల్ మీడియా లో రవితేజతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ” అద్భుతమైన, పాజిటివ్ మనిషి రవితేజ గారిని కలవడంతో నా అద్భుతమైన కొత్త సంవత్సరం ప్రారంభ మైంది. మా ఇద్దరి అద్భుత కలయిక సంతోషాన్నిస్తుంది. మొదటి మీటింగ్ నుంచి నన్ను అంమ్మిన వ్యక్తి.. త్వరలోనే అన్ని వివరాలు చెప్తాను. ప్రస్తుతం అందరు సేఫ్ గా ఉండండి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ‘ధమాకా’ సినిమాకోసమే విష్ణును రవితేజ కలిసి ఉంటాడని, త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని టాలీవుడ్ వర్గాలు చర్చించుకొంటున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే కొద్దీ రోజులు ఓపిక పట్టక తప్పదు మరి..

Related Articles

Latest Articles