ఇండియాలోనే ఉత్తమ వెబ్ సిరీస్ గా మంచు విష్ణు ‘చదరంగం’

నటుడు, నిర్మాత విష్ణు మంచు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్‌ ‘చదరంగం’. ఈ వెబ్ సిరీస్ తాజాగా ఉత్తమ వెబ్ సిరీస్-ప్రాంతీయ అవార్డును గెలుచుకుంది. మంచు విష్ణు ఈ వెబ్ సిరీస్‌ను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. రాజ్ అనంత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చదరంగం శ్రీకాంత్, సునైనా, నాగినేడు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఫిబ్రవరి 2020లో ZEE5 లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆన్-డిమాండ్ వీడియో, ఆడియో కంటెంట్‌లో రాణించడాన్ని గౌరవించటానికి ఎక్స్ఛేంజ్ 4 మీడియా (ఇ 4 ఎమ్) గ్రూప్ స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్ 2021తో ముందుకు వచ్చింది. మంచు విష్ణు మొదటిసారిగా నిర్మించిన ఓటిటి వెబ్ సిరీస్ ‘చదరంగం’ ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. “ఈ అవార్డు లభించడం గౌరవంగా ఉంది. వెబ్ సిరీస్ మన హృదయానికి చాలా దగ్గరగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉత్తేజకరమైన ప్రాజెక్టులతో ముందుకు రావడానికి ఇది మనల్ని ప్రేరేపిస్తుంది ” అంటూ విష్ణు మంచు ఈ అవార్డు ప్రకటన విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “ఈ గుర్తింపు లభించినందుకు మీకు ధన్యవాదాలు! శ్రీకాంత్, దర్శకుడు రాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్, మొత్తం తారాగణం, సిబ్బంది నన్ను నమ్మినందుకు ఈ అవార్డుకు అర్హులు. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో భారతదేశంలోనే ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఎంపిక కావడం మాకు గర్వకారణం” అంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-