చివరి షెడ్యూల్ లో విశాల్ ‘సామాన్యుడు’

యాక్ష‌న్‌ హీరో విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది ‘సామాన్యుడు’. ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ అనేది దీని ట్యాగ్‌లైన్. ఇంటెన్స్‌ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ద్వారా తు. పా. శరవణన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ మధ్య విశాల్ పుట్టిన‌రోజు సందర్భంగా విడుద‌ల చేసిన సామ‌న్యుడు టైటిల్, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ మూవీ సెకండ్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే… డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌ కానున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ మంగళవారం మొదలైంది. విశాల్ స‌ర‌స‌న‌ టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్‌గా న‌టిస్తోంది. యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పి.ఎ. తులసి, రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-