సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ‘సామాన్యుడు’!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాడు. తన చిత్రం ‘సామాన్యుడు’ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. డెబ్యూ డైరెక్టర్ టి.పి. శరవణన్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామాను జనవరి 14న విడుదల చేయాలని తొలుత భావించారు. కానీ అనివార్యంగా ఈ మూవీ విడుదల 26కి వాయిదా పడింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశాల్ దీనిని నిర్మించారు.

డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా. తులసి, రవీనా రవి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే తమిళనాడులో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ పెట్టారు. అలానే అజిత్ ‘వలిమై’ సినిమా గురించి ఎలాంటి ప్రకటన వినాల్సి వస్తుందోనని అతని అభిమానులంతా ఆందోళనగా ఉన్నారు. ఆ చిత్రాన్ని పొంగల్ కానుకగా ఈ నెల 13న విడుదల చేయాలని అనుకున్నారు.

Related Articles

Latest Articles