డబ్బింగ్ పనుల్లో విశాల్ రెండు సినిమాలు!

కరోనా కారణంగా గత యేడాది, ఈ సంవత్సరం చిత్రసీమలో షూటింగ్స్ కాస్తంత తగ్గుముఖం పట్టినా హీరో విశాల్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. కరోనా టైమ్ లోనే ‘ఎనిమి’ సినిమా షూటింగ్ ను ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి మాగ్జిమమ్ షూటింగ్ ఫిల్మ్ సిటీలోనే పూర్తి చేసేశాడు విశాల్. తమిళ క్రేజీ స్టార్ ఆర్య కీలక పాత్ర పోషించిన ‘ఎనిమి’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ఈ వారంలోనే మొదలై ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. డబ్బింగ్ థియేటర్ కు వచ్చిన తోటి ఆర్టిస్టుల ఫోటోలను సోషల్ మీడియాలో విశాల్ పోస్ట్ చేస్తూ హంగామా చేస్తున్నాడు.

Read Also : ఏపీ సీఎంని కలిసిన మంచు హీరో… అసలేం జరుగుతోంది ?

ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటే విశాల్ ‘సామాన్యుడు’ పేరుతో మరో సినిమాలోనూ నటించాడు. దీని డబ్బింగ్ కార్యక్రమాలు సైతం సోమవారం చెన్నయ్ లో మొదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కు రెడీ అవుతుండగానే గత వారం మరో సినిమాను విశాల్ పట్టాలెక్కించేశాడు. ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’లో నాయికగా నటించిన సునయన ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీలో విశాల్ సరసన నటిస్తోంది. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొన్న విశాల్ బర్త్ డే సందర్భంగా మొదలై పోయింది. మొత్తం మీద మిగిలిన హీరోల సంగతి ఎలా ఉన్నా… విశాల్ మాత్రం క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు.

Related Articles

Latest Articles

-Advertisement-