విశాల్, అజిత్ కి థియేటర్లు దొరికేనా!?

‘ఆర్.ఆర్.ఆర్’ బాక్సాఫీస్ రేసు నుంచి తప్పుకోవడంతో చోటామోటా సినిమాలు అన్నీ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దాదాపు పది సినిమాలు అధికారికంగా సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించాయి. వాటితో పాటు కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా రానున్నాయి. వాటిలో అజిత్ నటించిన ‘వాలిమై’, విశాల్ ‘సామాన్యుడు’ కూడా ఉన్నాయి. ఇవి రెండూ కూడా మాస్ ఎంటర్ టైనర్స్ కావటమే ఏకైక ప్లస్ పాయింట్. నిజానికి అజిత్, విశాల్ కి తెలుగులో మార్కెట్ లేదు. విశాల్ కి ఒకప్పుడు ఉన్న మార్కెట్ కంప్లీట్ గా పడిపోయింది. ఇక స్టార్ హీరో నాగార్జున ‘బంగార్రాజు’గా సంక్రాంతి రేసులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో అజిత్, విశాల్ కి థియేటర్లు ఏ మేరకు దొరుకుతాయన్నదే పాయింట్. ‘సామాన్యుడు’ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు సంక్రాతి వస్తామంటున్నారు. జనవరి 14న తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తారట.

Read Also: అరవింద్ కే ఝలక్ ఇచ్చిన ‘నాయట్టు’ నిర్మాతలు

తమిళనాట ఇప్పటికే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. అజిత్ ‘వాలిమై’ 13న విడుదల కానుండంతో విశాల్ సినిమాపై అంత ఆసక్తి చూపిస్తారా? ఎందుకంటే ఇటీవల కాలంలో విశాల్ కి హిట్ లేదు. తెలుగునాట అయితే విశాల్ సక్సెస్ మాట విని ఎంతో కాలం అయింది. సో పంపిణీదారులు, ప్రదర్శనదారులు లైట్ తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలుగులో ‘అతిథి దేవోభవ’,’1945′, ‘వేయి శుభములు కలుగుగాక’, ‘డిజె టిల్లు’, ‘సూపర్ మచ్చి’, ‘హీరో’, ‘రౌడీ బాయ్స్’, ‘7 డేస్ 6 నైట్స్’ వంటి సినిమాలు విడుదల అవుతున్నాయి. తెలుగు సినిమాలను కాదని విశాల్ సినిమాకు థియేటర్లు లభించాలంటే బడా డిస్ట్రిబ్యూటర్స్ పూనుకోవాలి. మరి అజిత్, విశాల్ వారిని ఎంత వరకూ ఆకట్టుకోగలరన్నదే మిలియన్ డాలర్‌ క్వొచ్చెన్.

Related Articles

Latest Articles