‘విరుమన్’ గా కార్తీని చూపించిన సూర్య..

ప్రయోగాలకు పెట్టింది పేరు హీరో కార్తీ. కథలో కొత్తదనం ఉండాలే కానీ ఎలాంటి పాత్రలోనైనా కార్తీ ఒదిగిపోతాడు. ఇక ఇటీవలే సుల్తాన్ చిత్రంతో మెప్పించిన కార్తీ మరో కథతో రెడీ ఐపోయాడు. ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న చిత్రం ‘విరుమన్`. ఈ చిత్రంలో కార్తీ సరసన డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ కోలీవుడ్ కి పరిచయమవుతుంది. ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య, వదిన జ్యోతిక నిర్మిస్తుండడం విశేషం. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో కార్తీ పల్లెటూరు యువకుడిగా కనిపిస్తున్నాడు.

ఇక ఈ పోటర్ చూస్తుంటే కార్తీ మొదటి సినిమా పరుత్తివీరన్ సినిమా గుర్తుకురాక మానదు. మెరూన్ కలర్ షర్ట్ ..పైకెత్తి కట్టిన లుంగీ.. చేతిలో బడిస పట్టుకొని రాళ్లపై కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్న కార్తీ మాస్ లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ తో కార్తీ మరో కొత్త కథకు తెరలేపినట్లు అర్ధమవుతుంది. నిజ జీవిత కథను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపాడు. ఇక ఈ పోస్టర్ ని రిలీజ్ చేసిన సూర్య అందరికి భోగీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న విరుమన్ ఈ ఏడాది వేసవికి విడుదల కానుంది. మరి ఈ సినిమాతో కార్తీ మరో హిట్ ని వెనకేసుకుంటాడా..? లేదా ..? అనేది చూడాలి.

Related Articles

Latest Articles