ఈ టోర్నీలో పాండ్య బౌలింగ్ చేస్తాడు : కోహ్లీ

హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్‌నెస్‌కు చేరువవుతున్నాడని, టోర్నీలో ఏదో ఒక దశలో బౌలింగ్ చేస్తాడు అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. అయితే భారత జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా పాండ్య వెన్నుముకకు జరిగిన శస్త్ర చికిత్స తర్వాత బౌలింగ్ లో అలాగే ఫిల్డింగ్ లో కొంత వెనుకపడ్డాడు. అయితే ఈ చికిత్స తర్వాత రెండు ఐపీఎల్ సీజన్ లు ఆడిన పాండ్య బౌలింగ్ చేయలేదు. దాంతో అతను ఇంకా ఫిట్ గా లేడు అని.. అలంటి సమయంలో పాండ్య ను ప్రపంచ కప్ కు ఏ విధంగా ఎంపిక చేస్తారు అని ప్రశ్నలు వచ్చాయి. అయితే ఈ విషయం పై తాజాగా కోహ్లీ మాట్లాడుతూ.. ఈ ప్రపంచ కప్ టోర్నీలోఏదో ఒక సమయంలో హార్దిక్ బౌలింగ్ చేస్తాడు. అలాగే బ్యాటర్ గా జట్టుకు చాలా విలువైనవాడని భారత కెప్టెన్ చెప్పాడు.

Related Articles

Latest Articles