కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణాలు చెప్పిన కోహ్లీ…

ఐపీఎల్ 2021 తర్వాత తాను రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ జట్టుకు కెప్టెన్ గా ఉండనని విరాట్ కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఎలిమినేటర్స్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోవడంతో ఈ ఏడాది ఐపీఎల్ లో బెంగళూర్ కథ ముగిసింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు తాను ఎందుకు కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నాను అనే విషయాన్ని కోహ్లీ ప్రకటించాడు. తాను ఈ బాధ్యతల నుండి తప్పుకోవడానికి పని భారమే ముఖ్య కారణమని విరాట్ కోహ్లీ అన్నాడు. నా పైన పని భారం పెరుగుతుంది. అయితే నేను ఎప్పుడైనా నా బాధ్యతలలో 100 కు 120 ఇవ్వలేకపోతున్నాను అని అనిపిస్తే అది చేయను. ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది. అందుకే కెప్టెన్ గా తప్పుకుంటున్నాను అని విరాట్ కొల్లీ ప్రకటించాడు. ఇక ఈ ఐపీఎల్ తర్వాత జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత జట్టుకు కూడా ఈ పొట్టి ఫార్మటు లో కెప్టెన్ గా ఉండను అని విరాట్ చెప్పిన విషయం తెలిసిందే.

-Advertisement-కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణాలు చెప్పిన కోహ్లీ...

Related Articles

Latest Articles