వివాదంలో విరాట్ కోహ్లీ… నిషేధం విధించాలని మాజీల డిమాండ్

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా విరాట్ కోహ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు. కేప్‌టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ నాటౌట్‌కు సంబంధించి డీఆర్ఎస్ విషయంలో విరాట్ కోహ్లీ స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి ప్రసార కర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ కోహ్లీపై విమర్శలు చేశాడు. కోహ్లీకి భారీ జరిమానా విధించాలని… అంతేకాకుండా కోహ్లీ నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఆటలో క్రికెటర్లు భావోద్వేగాలు వ్యక్తం చేయడంలో తప్పులేదని.. కానీ ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని వాన్ అభిప్రాయపడ్డాడు.

Read Also: ఈనెల 21న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్: ఐసీసీ

అటు ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా విరాట్ కోహ్లీ ప్రవర్తనపై మండిపడ్డాడు. విరాట్ కోహ్లీ ప్రవర్తన చెత్త ప్రవర్తన అంటూ ఆరోపించాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కూడా టీమిండియా కెప్టెన్ చర్యలు ఆమోదయోగ్యం కాదని… అతడిని కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్ కూడా కోహ్లీపై విమర్శలు చేశారు. గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ… ఒక అంతర్జాతీయ జట్టు కెప్టెన్ ఇలా వ్యవహరిస్తాడని తాను ఊహించలేదని వ్యాఖ్యానించాడు. ప్రతి విషయంలో ఓ హద్దు ఉంటుందని… ఆ హద్దు దాటి ప్రవర్తించినప్పుడు ఉపేక్షించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. షేన్ వార్న్ కూడా కోహ్లీ చేసిన చర్యను ఖండించాడు. ఇలాంటి తప్పులు కోహ్లీ మళ్లీ మళ్లీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు.

Related Articles

Latest Articles