ప్రాక్టీస్ లో కోహ్లీకి గాయం…?

ఇంగ్లాండ్ లో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయ‌ప‌డిన‌ట్లు సమాచారం. ప్రాక్టీస్‌ లో భారత పేసర్ మొహ్మద్ షమీ విసిరిన బౌన్స‌ర్‌కు కోహ్లీకి గాయం అయినట్లు తెలుస్తుంది. కోహ్లీ ప‌క్క‌టెముక‌ల‌కు గాయం అయినట్లు.. దాంతో అతను మూడు నుంచి ఆరు వారాలు ఆటకు దూరం కావాల్సి వ‌స్తుంద‌ని సమాచారం. కానీ దీని పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. ఒక‌వేళ కోహ్లీకి గాయం అయ్యింది నిజ‌మైతే మాత్రం భారత జట్టుకు పెద్ద దెబ్బ ప‌డిన‌ట్లే. ఎందుకంటే… సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌ తో భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ లో జూన్ 18 నుంచి తలపడనుంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే కోహ్లీ ఆ పూర్తి మ్యాచ్ కు దూరం అవుతాడు. దాంతో కెప్టెన్ స్థానంలో అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-