భారత కెప్టెన్ ఓపిక పట్టాలి అంటున్న లక్ష్మణ్…

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గత ఏడాది నుండి కోహ్లీ బ్యాటింగ్ లో అనుకున్న విషంగా రాణించలేదు. అంతేకాక కోహ్లీ సెంచరీ కొట్టి రెండు ఏళ్ళు దాటిపోయింది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆడుతున్న రెండో టెస్ట్ లో జట్టులోకి వచ్చిన కోహ్లీ సెంచరీ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి ఇన్నింగ్స్ లో డక్ ఔట్ అయిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఈ కోహ్లీ సెంచరీ విషయం పై భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్షణ్ మాట్లాడుతూ.. కోహ్లీని ఓపిక పట్టాలి అని సూచించాడు. అయితే కోహ్లీకి సాంకేతిక లోపం లేదా మానసిక సమస్యలు వంటిని లేవని చెప్పిన వీవీఎస్ అతను మూడెంకల స్కోర్ ను చేరాలంటే ఓపిక పట్టాలని అన్నాడు. అలా చేస్తే కోహ్లీ సెంచరీని త్వరగా చేరుకుంటాడు అని… ఆ తర్వాత అతను తిరిగి భారత్‌కు భారీ పరుగులు చేస్తాడని వీవీఎస్ పేర్కొన్నాడు.

Related Articles

Latest Articles