రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్న కోహ్లీ…

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ…రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. పాత రికార్డులను బద్దలు చేస్తూ…తన పేరిట లిఖించుకుంటున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ…అంతర్జాతీయ క్రికెట్‌లో 15వేల పరుగులు పూర్తి చేశాడు.

మైదానంలో పరుగులతోనే కాదు.. సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లతోనూ….కెప్టెన్ కోహ్లీ రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఓ ఘనమైన రికార్డును అందుకున్నాడు. కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 150 మిలియన్లకు చేరుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ. మొట్టమొదటి ఆసియా వ్యక్తి కూడా అతడే. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల్లో 4వ స్థానంలో ఉన్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో 337 మిలియన్లు, లియోనోల్‌ మెస్సీ 260 మిలియన్లు, నెయ్‌మార్‌ 160 మిలియన్ల ఫాలోవర్లతో కోహ్లీ కంటే ముందున్నారు.

సంపాదనలోనూ విరాట్‌ కోహ్లీ…ముందు వరుసలో నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎక్కువ ఆర్జిస్తున్న వారిలో టాప్‌-20లో నిలిచాడు. ఇన్‌స్టాలో ఒక పోస్టుకు అతడు రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడని తెలిసింది. హాపర్‌ హెచ్‌క్యూ 2021 అనే సంస్థ గతంలో ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌ పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. ఇందులో క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాడు, హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ డ్వేన్‌ జాన్సన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌లో టాప్‌-20లో నమోదైన ఏకైక క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ మాత్రమే.

మరోవైపు హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ…అరుదైన ఘనత సాధించాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి 15వేల పరుగులు చేసి…క్రికెటర్‌గా పేరు సంపాదించుకున్నాడు. భారత్‌ తరపున రాహుల్ ద్రవిడ్‌, కోహ్లీ, సౌరవ్‌ గంగూలీ, అజారుద్దీన్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, ఎంఎస్ ధోనీ తర్వాత…ఈ ఘనత అందుకున్న క్రికెటర్‌ రోహిత్ శర్మనే.

Related Articles

Latest Articles

-Advertisement-