కరోనాపై కోహ్లీ దంపతుల ఉద్యమం.. రూ. 2 కోట్లు విరాళం

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇక ఇండియాలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో కరోనా కట్టడికి రాజకీయ నాయకులతో పాటు, క్రికెటర్లు, సిని స్టార్లు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రజల కష్టాలను చూస్తే బాధ కలుగుతుందని.. అందుకే తన భార్య అనుష్క శర్మతో కలిసి కరోనాపై పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లుగా కోహ్లీ తెలిపారు. కష్ట కాలంలో కరోనాపై పోరాడుతున్న వారికి అండగా ఉందామని పిలుపు ఇచ్చారు. ketto వెబ్ సైట్ ద్వారా విరాళాలు సమీకరిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు కోహ్లీ దంపతులు. కరోనా పోరాటం కోసం రూ.2 కోట్లు ఇస్తున్నట్లుగా తెలుపారు కోహ్లీ దంపతులు. దీని ద్వారా రూ. 7 కోట్లు సమీకరించాలని ఈ జంట లక్ష్యంగా పెట్టుకుంది.

Related Articles

Latest Articles