ఏపీలో మ‌ళ్లీ ప్ర‌మాణాల లోల్లి… ప్ర‌మాణానికి సిద్ద‌మైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే…

గుంటూరు జిల్లాలో రాజ‌కీయాలు ఆసక్తిక‌రంగా మారుతున్నాయి.  గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్మ‌హ్మానాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవీపై ఆరోప‌ణ‌లు చేశారు.  జీవీ స్వ‌చ్చంధ సంస్థ‌కు ఎన్నారై నిధులు వ‌స్తున్నాయ‌ని ఆరోపించారు.  దీనిపై జీవీ ఘాటుగా స్ఫందించారు.  త‌న సంస్థ‌కు ఎలాంటి ఎన్నారై నిధులు రావ‌డంలేదని తాను కొట‌ప్ప‌కొండ‌లో ప్ర‌మాణం చేస్తాన‌ని అన్నారు.  జీవీ ప్ర‌మాణంపై పోలీసులు స్పందించారు.  ప్రస్తుతం 144 సెక్ష‌న్ అమ‌లులో ఉందని, ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు వెళ్లేందుకు వీలులేద‌ని జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆరోప‌ణ‌లు నిరూపించలేక పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని త‌ప్పించుకుంటున్నార‌ని జీవీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ప్ర‌మాణాలు వ‌ద్దు అని, బ్యాలెన్స్ షీట్‌తో వ‌స్తే ఇద్ద‌ర‌మే లెక్క‌లు తేల్చుకుందామ‌ని బొల్లా కౌంట‌ర్ ఇచ్చారు.  అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌క‌పోతే లెక్క‌లు చూప‌డానికి భ‌యం ఎందుకు అని బొల్లా ప్ర‌శ్నించారు.  దీంతో వినుకొండ‌లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-