బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరు: వినోద్ కుమార్

కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ పై నిప్పులు చెరిగారు. శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌, ఫడ్నవీస్‌, రమణ్‌ సింగ్‌, హేమంత బిశ్వశర్మ మీరంతా ఒకేసారి రండి రవీంద్ర భారతిలో కూర్చొని మీ రాష్ట్రాల అభివృద్ధి.. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుదామని సవాల్‌ విసిరారు. మా రాష్ట్ర మంత్రులు ఉంటారు…మీరు మీ అధికారులతో రండి …అభివృద్ధి గురించి చర్చిద్దామన్నారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన అన్నారు.

Read Also: కేప్‌టౌన్ టెస్ట్… 33 పరుగులకే ఓపెనర్లు ఔట్

ఈ నలుగురు నేతలు 33 జిల్లా తిరిగితే తెలంగాణ ఏంటో తెలుస్తుందన్నారు. నలుగురికి హెలికాప్టర్లు మేమే ఇస్తాం …రాష్ట్రం అంత తిరిగి చూడండి. ఆర్ఎస్ఎస్ సమావేశాల కోసం జేపీ నడ్డా వస్తే ..బండి సంజయ్ అరెస్టు కోసం వచ్చినట్టు చెప్పుకున్నారని ఆరోపించారు. బ్యాంకులను మోసం చేసిన వారిలో ఎక్కువ గుజరాతీలే ఉన్నారని తెలిపారు. ఒకవైపు తెలంగాణ సర్కార్‌పై విమర్శలు చేస్తూ..మరో వైపు పథకాలు గురించి ఇక్కడి అధికారులను తీసుకుని వెళ్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు..తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు పోలిక లేదన్నారు. అంతా బాగుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి స్కీమ్స్‌ ఎందుకు స్టడీ చేస్తున్నారో చెప్పాలని డిమండ్‌ చేశారు. రాముడి పేరుతో ఓట్లు దండుకునే పార్టీ అంటూ వినోద్‌ బీజేపీని విమర్శించారు.

Related Articles

Latest Articles