ఆ ఘనత కేంద్ర ప్రభుత్వ బీజేపీ పార్టీదే : వినయ్‌ భాస్కర్‌

తెలంగాణ రాష్ట్ర, చారిత్రాత్మక హన్మకొండ నగర అభివృద్ధిని వీక్షించేందుకు విచ్చేస్తున్నా బీజేపీ కేంద్ర నాయకత్వానికి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మకి స్వాగతమని తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ అన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చారిత్రక నగరం హన్మకొండకు వచ్చే ముందు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు నెరవేర్చిన తరువాత నగరంలో అడుగు పెట్టండని ఆయన అన్నారు. వరంగల్ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూపించేందుకు ఇతర రాష్ట్రాల నాయకులను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కేసులు పెట్టి జైలుపాలు చేసిన విషయం గుర్తుచేసుకోవాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాకముందు తెలంగాణ రైతాంగం పరిస్థితి వర్ణనరహితమన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ ఎక్కడైనా ఆగి రైతులతో మాట్లాడి కేసీఆర్ రైతులకు అందిస్తున్నా రైతుబంధు, రైతు బీమా గురించి అడిగి తెలుసుకొండని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకులకు నగరం మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేట కోచ్ ప్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఉక్కు ప్యాక్టరీ తీసుకుని రండి అని ఆయన సవాల్‌ చేశారు.

ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు సైతం లెక్క చేయని ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని దూషిస్తే సహించేది లేదని. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడాండని ఆయన పేర్కొన్నారు. ప్రణాళిక బద్దంగా సీఎం కేసీఆర్ 317 రాష్ట్రపతి జీవోకి అనుగుణంగా చేస్తుంటే కావల్సుకొని రాద్దాంతం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వ బీజేపీ పార్టీదేనని ఎద్దేవా చేశారు.

Related Articles

Latest Articles