విచిత్రమైన గ్రామం: రోజుల త‌ర‌బ‌డి నిద్ర‌లో గ్రామ‌స్తులు… లేచిన వెంట‌నే…

మామూలుగా ఎవ‌రైనా స‌రే 8 గంట‌లు లేదా 10 గంట‌లు నిద్ర‌పోతారు.  చిన్న‌పిల్ల‌లైతే రోజులో 16 గంట‌లు నిద్ర త‌ప్ప‌నిస‌రి.  అయితే, ఓ గ్రామంలోని ప్ర‌జ‌లు మాత్రం గంట‌లు కాదు రోజుల త‌ర‌బ‌డి నిద్ర‌పోతున్నార‌ట‌.  కొందరు రెండు మూడు రోజుల‌పాటు లేవ‌కుండా నిద్ర‌పోతే, మ‌రికొంద‌రు మాత్రం ఆరు రోజుల‌పాటు నిద్ర‌పోయేవార‌ట‌.  ఆక‌లిద‌ప్పిక‌లు అన్నిమ‌రిచిపోయి అలా ఎందుకు నిద్ర‌పోయేవారో అంతుచిక్క‌లేదు.  ఇలా లేవ‌కుండా నిద్ర‌పోతున్న విష‌యం తెలుసుకున్న అధికారులు వైద్యుల‌ను పంపి వారికి సెలైన్ పెట్టించేవారు.  ఇక లేచిన వెంట‌నే విప‌రీత‌మైన శృంగారం కోరిక‌ల‌తో రెచ్చిపోయేవార‌ట‌.  

Read: “ఎస్ఆర్ కళ్యాణమండపం” హీరో బర్త్ డే స్పెషల్ టీజర్

ఇలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసుకొవ‌డానికి వైద్య‌నిపుణులు ఆగ్రామంలోనే మ‌కాం వేసి ప‌రిశోధ‌న‌లు చేశారు.  ఇలాంటి విచిత్ర‌మైన సంఘ‌ట‌ల‌ను చోటుచేసుకున్న గ్రామంపేరు క‌లాచీ.  ఖ‌జికిస్తాన్ దేశంలో ఉన్న‌ది.  ఒక‌ప్పుడు ఇది ర‌ష్యాలో అంత‌ర్భాగం.  ఈ గ్రామానికి స‌మీపంలో యూరేనియం గ‌నులు ఉండేవి.  వీటిని అప్ప‌ట్లో సోవియ‌ట్ యూనియ‌న్ తవ్వ‌కాలు జ‌రిపింది.  ఆ త‌రువాత మైనింగ్‌ను నిలిపివేసింది.  ఆ త‌రువాత అ ప్రాంతంలో క్ర‌మంగా విష‌వాయువులు విడుద‌ల‌కావ‌డం మొద‌లుపెట్టాయి.  గాలిలో కార్బ‌న్ మోనాక్సైడ్ శాతం పెరిగింది.  దీని కార‌ణంగానే ఇలా అతినిద్ర వ్యాధి సంక్ర‌మించింద‌ని నిపుణులు గుర్తించారు.  2012 నుంచి 2015 వ‌ర‌కు మూడేళ్ల‌పాటు ఆ గ్రామంలోని ప్ర‌జ‌లు ఇలాంటి వింత నిద్ర జ‌బ్బుతో బాధ‌ప‌డ్డారు.  ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయ‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు.  ఈ గ్రామాన్ని అధికారులు నిత్యం ప‌రిశీలిస్తూనే ఉంటారు.  మైనింగ్ నిలిపివేసిన త‌రువాత అడ‌వులు పెర‌గ‌డంతో ప్ర‌స్తుతానికి గాలిలో కార్బ‌న్ మోనాక్సైడ్ శాతం త‌గ్గిన‌ట్టు పరిశోధ‌కులు చెబుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-