వందకోట్ల ఓటిటి ఆఫర్ ను వదులుకున్న ‘విక్రాంత్ రోనా’

కరోనా కారణంగా ఓటిటికి మంచి ఆదరణ పెరిగింది. దీంతో భారీ సినిమాలకు కూడా ఓటిటిలో సినిమాలను డైరెక్ట్ గా విడుదల చేయడానికి కోట్లలో ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చాలామంది మేకర్స్ ఈ ఆఫర్లను తిరస్కరిస్తూ తమ సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇప్పుడు శాండల్ వుడ్ హీరో కిచ్చా సుదీప్ కూడా ఓ భారీ ఆఫర్ కు నో చెప్పాడట. కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోనా’ 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. అనుప్ భండారి రూపొందించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ప్రకటించినప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. పాన్ ఇండియా 3డి చిత్రం టైటిల్ ను బుర్జ్ ఖలీఫాపై గ్రాండ్ గా లాంచ్ చేయడం నుంచి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావడం వరకు “విక్రాంత్ రోనా” ముఖ్యాంశాల్లో నిలిచారు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘విక్రాంత్ రోనా’ నిర్మాతలు 100 కోట్ల భారీ ఆఫర్‌ను తిరస్కరించారు.

Read Also : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ లీక్… మీడియాకు రిక్వెస్ట్

మీడియా ఇంటరాక్షన్ లో నిర్మాత జాక్ మంజునాథ్ వద్ద ఈ విషయాన్నీ ప్రస్తావించగా… ఆయన మాట్లాడుతూ ‘అవును ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే. కానీ విక్రాంత్ రోనాను బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. నేను వ్యక్తిగతంగా చూసిన విజువల్స్ పెద్ద స్క్రీన్‌పై కుటుంబాలు, పిల్లలను థ్రిల్ చేసేలా ఉన్నాయి. 3డి అనుభవం అనేది ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునే అంశం. దేశంలోనే అతి పెద్ద స్క్రీన్‌లకు అర్హమైన సినిమా ఇది. ప్రేక్షకులకు సినిమా ఖచ్చితంగా మంచి అనుభూతిని ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

కిచ్చా సుదీప్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ నటించిన ‘విక్రాంత్ రోనా’ను జీ స్టూడియోస్ సమర్పణలో, జాక్ మంజునాథ్ తన ప్రొడక్షన్‌లో షాలిని ఆర్ట్స్‌పై, అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా నిర్మించారు. ఈ చిత్రం 2022 ఫిబ్రవరి 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles