హాలీవుడ్ మూవీని తలపిస్తున్న ‘విక్రాంత్ రోణ’ డెడ్ మ్యాన్స్ యాంథమ్!

ఇవాళ కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బర్త్ డే. ఈ సందర్భంగా అతను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’కి సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. డెడ్ మ్యాన్స్ యాంథమ్ గా వచ్చిన 1.21 నిమిషాల వీడియోను చూస్తే… హాలీవుడ్ మూవీ గ్లిమ్స్ ను చూసిన భావనే కలుగుతోంది. అనూప్ భండారి దర్శకత్వంలో జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ నిర్మిస్తున్న యాక్షన్ అడ్వంచరస్ త్రీ డీ సినిమా పలు భారతీయ భాష్లలో విడుదల కాబోతోంది. బి. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. కిచ్చా సుదీప్ తో పాటు నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషించారు.

Related Articles

Latest Articles

-Advertisement-