రాజమౌళి తండ్రి ఫోన్ వాల్ పేపర్ గా పూరి జగన్నాథ్ పిక్…!!?

ప్రముఖ దర్శకుడు, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ భారత చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ, ప్రఖ్యాత స్క్రిప్ట్ రచయితలలో ఒకరు. ప్రస్తుతం ఆయన “ఆర్ఆర్ఆర్” చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న ఆయన “ఆర్‌ఆర్‌ఆర్” గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని చూశానని, అది చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అలియా భట్ పాత్ర అద్భుతంగా ఉంటుందని, స్క్రీన్ పై ఆమె అందరినీ డామినేట్ చేస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ టాక్ షోలో భాగంగా విజయేంద్ర ప్రసాద్ తన అభిమాన దర్శకుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ అభిమాన దర్శకుడు ఎవరు ? అని అడిగినప్పుడు… విజయేంద్ర ప్రసాద్ వెంటనే పూరి జగన్నాధ్ అని సమాధానం ఇచ్చారు. “పూరి జగన్నాధ్ నాకు ఇష్టమైన దర్శకుడు. వాస్తవానికి నా ఫోన్ వాల్‌పేపర్ గా పూరి జగన్నాథ్ ఉంటుంది” అంటూ తన ఫోన్ ను చూపించడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-