“ఆర్ఆర్ఆర్” ఎన్టీఆర్ కు ముస్లిం టోపీ అందుకేనా ?

ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. “ఆర్‌ఆర్‌ఆర్” విడుదలకు ముందే జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన అప్డేట్స్ సంచలనం సృష్టిస్తున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల ప్లాన్ల గురించి కూడా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమాపై నెలకొన్న వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. “ఆర్ఆర్ఆర్” అనే చిత్రం “బాహుబలి” లాంటిది కాదని హామీ ఇచ్చారు. మేకర్స్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఓ టీజర్ ను రిలీజ్ చేయగా… అందులో జూనియర్ ఎన్టీఆర్ ను ముస్లిం టోపీలో ధరించినట్టు చూపించారు. దీంతో చాలామంది రాజమౌళిపై ట్రోలింగ్ కు దిగారు.

Read Also : “బిగ్ బాస్-5” హోస్ట్ పై వీడిన సస్పెన్స్ !!

కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం పాత్ర, సాంప్రదాయ దుస్తులను ధరించారు. ఆ విమర్శలను ఉద్దేశించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “దీని వెనుక ఖచ్చితమైన కారణం ఉంది. కథలో అతన్ని హైదరాబాద్‌కు చెందిన నిజాం వెంటాడుతున్నాడు. కాబట్టి అతను నిజాం పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకె వాళ్ళను మభ్యపెట్టడానికి ముస్లిం యువకుడిగా వేషం మార్చుకున్నాడు” అంటూ కథ మొత్తం చెప్పేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-