‘బజ్రంగీ భాయ్ జాన్ 2’… కేవీ విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే…

సల్మాన్ ఖాన్ కి గత కొంత కాలంగా సరైన హిట్స్ లేవనే చెప్పాలి. ‘రాధే, ట్యూబ్ లైట్, రేస్ 3’… ఇలా చాలా సినిమాలు నిరాశపరిచాయి. ఆయన లాస్ట్ బ్లాక్ బస్టర్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ‘బజ్రంగీ భాయ్ జాన్’ మూవీనే! ఆ సినిమా తరువాత ఒకట్రెండు సక్సెస్ లు వచ్చినా బాక్సాఫీస్ బద్ధలుకొట్టే రేంజ్ లో రాలేదు. అందుకే, సల్మాన్ ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు…

‘టైగర్ 3’ సినిమా ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలకు సీక్వెల్ గా రూపొందుతోంది. మొదటి రెండు యాక్షన్ థ్రిల్లర్స్ బంపర్ హిట్స్ కాబట్టి ఇది కూడా పెద్ద విజయం సాధిస్తుందని బాలీవుడ్ లో టాక్. అయితే, ‘టైగర్ 3’ తరువాత మరో క్రేజీ సీక్వెల్ కి అన్ అఫీషియల్ గా సల్లూ భాయ్ తలూపాడట! అదే ‘బజ్రంగీ భాయ్ జాన్ 2’…

Read Also : సూర్య సినిమా సంగీత దర్శకుడి కన్నుమూత

సల్మాన్, కరీనా జంటగా చిన్నారి ‘మున్నీ’ పాత్రలో హర్షాలీ మల్హోత్రా నటించగా తెరకెక్కిన చిత్రం ‘బజ్రంగీ భాయ్ జాన్’. ఈ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కి స్టోరీ అందించింది మన కేవీ విజయేంద్రప్రసాదే! ఇక ఇప్పుడు ఆయన మరో కథతో సిద్ధంగా ఉన్నాడట. ఆల్రెడీ సల్మాన్ కు ‘పాయింట్’ ఏంటో నరేట్ చేశాడట కూడా. క్యాజువల్ గా విన్నప్పటికీ… బాలీవుడ్ సూపర్ స్టార్ ‘బజ్రంగీ భాయ్ జాన్ 2’ కథ విషయంలో ఎగ్జైటెడ్ గా ఉన్నాడని విజేయేంద్ర ప్రసాద్ అంటున్నాడు. మిగతా నటీనటులు కూడా అంగీకరిస్తే ‘బజ్రంగీ భాయ్ జాన్ 2’ సెట్స్ మీదకు వెళ్లటం పెద్ద కష్టమేమీ కాదట. చూడాలి మరి, బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్… ‘బజ్రంగీ భాయ్ జాన్’ గా మరోసారి జనం ముందుకొచ్చేందుకు చొరవ చూపిస్తాడో లేదో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-