అవినీతి సీఎంను దించాలా… ఉంచాలా ? : విజయశాంతి

లక్ష రూపాయలు రుణమాఫీ చెయ్యకుండా నాన్చుతున్నరు. కేసీఆర్ హయాంలో పేదపిల్లలు చదువుకొనే 4 వేల స్కూల్స్ మూత బడ్డాయి అని విజయశాంతి అన్నారు. భూనిర్వాసితుల ఉసురుపోసుకున్నరు. డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు. బతుకమ్మ చేరెలు కట్టుకొనెలా ఉన్నాయా అని ప్రశ్నించారు. దొరగారు వస్తె రోడ్డుపక్కన మా అక్క చెల్లెళ్ళు దండం పెడుతూ నిలబడలా. ఇదా ఆడవారికి మీరు ఇచ్చే గౌరవం దొరగారు. 7 ఏళ్లుగా 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒక్క పథకం అమలు కాదు. ఎవరి జేబుల్లోకి వెళ్ళింది ఆ డబ్బు. మీ జేబులు నిండాయి తప్ప ప్రజలు బాగుపడలేదు. నాలుగు లక్షల కోట్లు ఏమయ్యాయి అని ప్రజలారా మీరు కేసీఆర్ ను నిలదీయాలి. ఈ అవనీతి సీఎంను దించాలా? ఉంచాలా అని ప్రశ్నించారు.

ఇక కాంగ్రెస్ వారికి దిమాగ్ లేదు అన్న విజయశాంతి కేసీఆర్ ఈటల రాజేందర్ ను బీజేపీ లో చేర్చారు అని కాంగ్రెస్ వారు చెప్తున్నారు. అబద్దం చెప్పినా అతికేలా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు మా ఎమ్మెల్యేలు అమ్మబడును అని బోర్డ్ పెట్టుకున్నారు. అందుకే మీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు. హుజురాబాద్ లో తెరాస ఓడిపోతుందని కెసిఆర్ కి తెలిసిపోయింది అందుకే హుజూరాబాద్ లో కెసిఆర్ మీటింగ్ పెట్టుకోవడం లేదు అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles