ఫాంహౌస్‌లో కూర్చోని రాత్రికి రాత్రే జీవోలు తెస్తారా..? : విజయశాంతి

తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. బీజేపీని అడ్డుకోవడానికి, ఉద్యమాలను అణచివేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు బీజేపీ నాయకురాలు విజయ శాంతి. మమ్మల్ని చంపినా..4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేస్తామని విజయశాంతి అన్నారు. కేసీఆర్ ను గద్డె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బండి సంజయ్ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, 317 జీవో సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఫామ్ హౌజులో కూర్చోని రాత్రికిరాత్రి జీవోలు తీసుకువస్తున్నారని విమర్శించారు. పోలీసులు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ ని లాక్కెళ్లడం, మహిళల చీరలు లాగేయడం, కార్యకర్తలపై లాఠీ ఛార్జీ చేయడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు.

Read Also:బీజేపీ కేసులకు భయపడదు: ఈటల రాజేందర్‌

టీఆర్‌ఎస్‌కు లేని కరోనా నిబంధనలు, బీజేపీకి వర్తిస్తున్నాయ దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విజయశాంతి తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయన్నారు. మేం దీక్షలకు పిలుపునిచ్చినప్పడే కాంగ్రెస్ చేత దీక్షలు పెట్టిస్తున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ చేసిన పాపాలు కూడా త్వరలోనే ప్రజలకు తెలుస్తాయన్నారు. కేసీఆర్ ఓ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తాడని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో బావిలోపడి మనిషి చనిపోతున్నా అది బయటకు రావడం లేదంటూ ధ్వజమెత్తారు. ఏమైనా నరబలి ఇస్తున్నాడా..? అని ప్రశ్నించింది. నువ్వు ఎక్కువ ఏళ్లు బతికేందుకు నరబలులు ఇస్తున్నావా అంటూవిజయశాంతి ఫైర్‌ అయ్యారు.

Related Articles

Latest Articles