సిఎం కేసీఆర్ అణువణువునా అహంకారమే : విజయశాంతి

సీఎం కేసీఆర్ పై బిజేపి నేత విజయశాంతి మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ లో అణువణువునా అహంకారం ఉందని మండిపడ్డారు. “తెలంగాణ సీఎం కేసీఆర్ గారిలో అణువణువునా నిండిన అహంకారం ఫలితం ఏమిటో నేటి మీడియా కథనం చూస్తే అర్థమవుతుంది. విపక్షాలు ఎంతగా చెప్పినా… ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా వినకుండా పట్టుదలకు పోయి ఈ సర్కారు నిర్వహించిన పలు ఎన్నికల వల్ల పలువురు ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వైద్య ఖర్చులు భరించలేక వారి కుటుంబాలు అప్పుల పాలై నడిరోడ్డున పడ్డాయి, వారి పిల్లలు అనాథలయ్యారు. అధికారం తప్ప మరేది పట్టని తెలంగాణ పాలకుల తీరే ఈ ఘోరానికి మూలమని ఆధారాలతో సహా ఆ మీడియా కథనం రుజువు చేసింది. తెలంగాణ సర్కారు అసమర్థ పాలన వల్ల… పరిస్థితులు సవ్యంగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రజా వ్యతిరేకత తప్పదని అధికార పార్టీకి బాగా తెలుసు. అందుకే కరోనా ముప్పున్న సమయంలో అయితే తమకు నచ్చినట్టుగా ఎన్నికలు నిర్వహించుకుని అధికారం చేజిక్కించుకోవచ్చనే దురుద్దేశ్యంతోనే ఈ చర్యకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. ఈ తప్పుడు నిర్ణయాల ఫలితాలకు తెలంగాణ సర్కారే పూర్తి బాధ్యత వహించాలి. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు పరిహారం చెల్లించి కొంతైనా పాప ప్రక్షాళన చేసుకోవాలి.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-