లోకేష్, చంద్రబాబు ఏపీలో లేరు కాబట్టే ముందే వర్షాలు.. అడుగుపెడితే అంతే !

టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని.. వారు కరువుకు మారు పేరు అని చురకలు అంటించారు. “తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. కరువుకు మారు పేరుగా మారిన నారా వారు ఇంకో 4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే రుతుపవనాలు వర్షాలను కుమ్మరిస్తాయి. గడచిన రెండేళ్లలాగే ఈ ఏడూ జూన్ లోనే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు బేషరతుగా ఇంకో పార్టీకి మద్ధతిస్తానని ప్రాధేయపడటం ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. సొంతంగా గెలిచే సత్తాలేదని బాగా తెలుసు. అందుకే వాళ్లు ఛీ పో అన్నా, ఈసడించి కొట్టినా బాబు నోరు మెదపడం లేదు. ఆశ చావడం లేదు కాబోలు.” అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఇక అంతకుముందు ట్వీట్ లో “ఒక్క ఇటుక కూడా పెట్టకుండానే అమరావతి గ్రాఫిక్స్ కోసం 5 ఏళ్లు గడిపేశాడు చంద్రబాబు. తాడిపత్రిలో 500 ఆక్సిజన్ బెడ్ల జర్మన్ హ్యాంగర్ హాస్పిటల్ ను 15 రోజుల్లో పూర్తి చేయించారు సిఎం జగన్ గారు. ప్రజల కోసం తపించే నాయకుడికి, పబ్లిసిటీతో బతికే పరాన్నజీవికి తేడా ఇదే.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-