చంద్రబాబుది ఎప్పుడూ ‘దొంగ’ చూపే.. దొంగ దెబ్బ కొట్టాలని చూస్తుంటాడు!

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. చంద్రబాబుది ఎప్పుడూ దొంగ చూపే అని చురకలు అంటించారు. “బాబు మాయలో పడి పోతురాజులా కొరడాతో వాతలు తేలేలా కొట్టుకునే వారికి కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది. ఎవరో ఉసిగొల్పితే పిచ్చి చేష్టలు చేసి ఒళ్లు హూనం చేసుకున్నామని పశ్చాతాప పడతారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోతుంది. ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకోవాలని సిఎం జగన్ గారు ముందుచూపుతో వ్యవహరిస్తుంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీది ఎప్పుడూ ‘దొంగ’ చూపే. లిటిగేషన్లతో ప్రభుత్వాన్ని దొంగ దెబ్బ కొట్టాలని చూస్తుంటాడు. లిటిగెన్సీని నమ్ముకుని ఎవరూ బాగుపడ లేదని చరిత్ర చెబుతోంది.” అంటూ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ఇక అంతకు ముందు ట్వీట్ లో “ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని నమ్మే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు రాష్ట్ర విద్యా రంగంలో నవ శకానికి శ్రీకారం చుట్టారు. పేద పిల్లల సంపూర్ణ విద్యా వికాసానికి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అనేక విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-