కరోనా లాగానే చంద్రబాబు రోజుకో తీరు మారుతున్నాడు !

టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. కరోనా వైరస్ లాగానే చంద్రబాబు.. రోజుకో వేరియంట్ గా మారుతున్నాడని ఎద్దేవా చేశారు. “కరోనా వైరస్ లాగానే చంద్రబాబు రోజుకో తీరు మారుతున్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు కొత్త వేరియంట్‌ లా మారుతున్నాడు. బాబూ, నీది మీటర్ గేజ్ పై తిరిగే రైలు. ఈ రెండేళ్లలో రాష్ట్రమంతా గేజి మార్పిడి జరిగి బ్రాడ్ గేజ్ అందుబాటులోకి వచ్చింది. అయినా ఈ పట్టాల మీదే తిప్పుతా అంటే రైలు అక్కడే కూరుకుపోతుంది. దానిని అలా వదిలేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు ప్రజలు. వ్యర్థ తాపత్రయాలు మానుకో. బాబు ఒక వాస్తవాన్ని కావాలనే మర్చిపోయినట్టు నటిస్తున్నాడు. తన అక్రమాలకు దన్నుగా నిల్చిన వారిని కాపాడుకోవడానికి, పెంచి పోషించిన వ్యవస్థలను ఇప్పటికీ మ్యానేజ్ చేస్తూ ఉండవచ్చు. కానీ అధికారం రావాలంటే ఈ వ్యవస్థలు, రోజుకు కోటి ఫీజు తీసుకునే లాయర్ల సాయం సరిపోదు. ప్రజలు కోరుకోవాలి.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-