చంద్రబాబు అసలు ఎజెండా దోచుకోవడమే..అందుకే ప్రజలు ఈడ్చి కొట్టారు!

టిడిపి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు దోచుకోవడం తప్ప వేరే ఎజెండానే లేదని..అందుకే ప్రజలు ఈడ్చి కొట్టారని చురకలు అంటించారు. చంద్రబాబు ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయ్యేదన్నారు. “ప్రజలు ఈడ్చి కొట్టారు కాబట్టి సరిపోయింది. బాబు ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయ్యేది. ఇసుక మాఫియా, మైనింగ్, నీరు-చెట్టు నిధుల్ని బొక్కే మాఫియా, హెరిటేజ్ కోసం పాడి రైతులను బికారుల్ని చేసిన డెయిరీ మాఫియా. దోచుకోవడం తప్ప వేరే ఎజెండానే లేదు. 14 ఏళ్లు సిఎంగా ఉన్నా బాబు ఏనాడూ ప్రజారంజక పాలకుడు కాలేక పోయాడు. ఎల్లో మీడియా సపోర్టుతో పదవిలో కొనసాగాడు. ప్రజలంటే ఎప్పడూ చిన్నచూపే. తాగు నీరు దొరక్క జనం అంటువ్యాధుల బారిన పడుతుంటే హిమాలయ బ్రాండ్ మినరల్ వాటర్ తాగేవాడు. 108 అంబులెన్సులను మూల పడేసి, 6 కోట్ల బస్సులో విశ్రమించేవాడు.” అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇక మరో ట్వీట్ లో “చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కకుండా వడ్డీ లేకుండా రూ. 10 వేలు సాయం అందించే జగనన్న తోడు పథకం రెండో విడత సాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. రెండు విడతల్లో మొత్తం 9.05 లక్షల మందికి రూ. 905 కోట్లు సాయం అందించారు.” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-