‘మనిషివా చంద్రబాబు’ అనే పరిస్థితి తెచ్చుకున్నాడు : విజయసాయి సైటెర్లు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఏపీ పర్యటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ రేంజ్‌ లో సెటైర్లు వేశారు. ‘మనిషివా చంద్రబాబు’ అనే పరిస్థితి తెచ్చుకున్నాడంటూ చంద్రబాబు కు చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. ”గాల్లో కలిసిపోతారని సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి ‘మనిషివా చంద్రబాబు’ అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు.” అంటూ ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి.

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపతికన సహాయ చర్యలు చేపట్టిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు మాత్రం తాను మళ్ళీ సీఎం అయ్యాక బాధితులకు 25 లక్షల పరిహారం ఇస్తానంటున్నాడంటూ ఎద్దేవా చేశారు.

Related Articles

Latest Articles