స్మగ్లర్లతో తెప్పించుకుని మరీ..లోకేష్, చంద్రబాబు టీకాలు వేసుకున్నారు !

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. దేశ ప్రజలు మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే.. చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని వేయించుకున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. “దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాకముందే స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని తండ్రి కొడుకులు వేయించుకున్నారని అందరూ అనుకుంటున్నారు. ఎల్లో మీడియా ఫ్రంట్ పేజీల్లో ఫోటోలు కనిపించక పోయేటప్పటికి అనుమానాలు బలపడుతున్నాయి. మేం సేఫ్ గా ఉంటే చాలనుకునే రకాలు కదా! ” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో తిరుపతి ఉప ఎన్నికపై విజయసాయి రెడ్డి కామెంట్ చేశారు. “తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు, మాలోకం, అచ్చెన్న, బిజెపి పెద్దలు కితకితలు పెట్టకపోయి ఉంటే ఆ పార్టీల అభ్యర్థులకు నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చేవి. గులకరాయి డ్రామాలు, దొంగ ప్రమాణాలు, సంక్షేమ పథకాలు ఎత్తేస్తామనే పిచ్చి ప్రేలాపనలతో ఓటర్లు అసహ్యించుకునేలా చేసుకున్నారు.” అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

-Advertisement-స్మగ్లర్లతో  తెప్పించుకుని మరీ..లోకేష్, చంద్రబాబు టీకాలు వేసుకున్నారు !

Related Articles

Latest Articles